యువ నటుడు కన్నుమూత

Telugu Lo Computer
0


కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నితిన్‌ గోపీ శుక్రవారం రాత్రి హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందూతూ నితిన్‌ తుది శ్వాస విడిచారు. యువనటుడి అకాల మరణంతో శాండల్‌వుడ్‌ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. అతని వయసు కేవలం 30 సంవత్సరాలే కావడం గమనార్హం. ఛైల్డ్‌ ఆర్టిస్టుగా వెండితెరకు పరిచయమైన నితిన్‌ గోపీ దిగ్గజ నటుడు డాక్టర్‌ విష్ణు వర్ధన్‌తో కలిసి హలో డాడీ అనే చిత్రంలో నటించాడు. ఇందులో విష్ణు వర్ధన్‌ కుమారుడి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముత్తినంత హెంతి, కేరళిద కేసరి, నిశ్శబ్ధ, చిరబండవ్య వంటి ల్లో కూడా నితిన్‌ నటించారు. భక్తి సీరియల్‌ హర హర మహాదేవ్‌లో కొన్ని ఎపిసోడ్స్‌లో కూడా కనిపించారు. కన్నడ, తమిళ్‌ భాషల్లో సూపర్‌హిట్‌గా నిలిచిన కొన్ని ధారావాహికల్లోనూ నటించి మెప్పించారు. కాగా ప్రముఖ భక్తి సీరియల్ హర హర మహాదేవ్‌లో కొన్ని ఎపిసోడ్స్‌లో కనిపించాడు. ఇటీవల ‘ధృవ నక్షత్రం’ సీరియల్‌కి దర్శకత్వం వహించారు కూడా. మరో కొత్త సీరియల్‌ను తెరకెక్కించేందుకు కూడా సిద్ధమయ్యాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)