నైజీరియాలో పడవ మునిగి 103 మంది పెళ్లి వారు జలసమాధి

Telugu Lo Computer
0

                               

నైజీరియాలోని ఎగ్బోటి గ్రామంలో జరుగుతున్న వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా పెళ్లివారి పడవ నైజర్‌ నదిలో అలల తాకిడికి నీట మునిగింది. ఈ ఘోర ప్రమాదం మంగళవారం తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమదంలో 103 చనిపోయినట్లుగా నైజీరియా అధికారులు తెలిపారు. అయితే బోట్ మునిగిన వార్త తెలుసుకున్న అధికారులు సహాయక బృందాలు, గజఈతగాళ్లతో నైజర్ నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. పడవ ప్రమాదంలో ప్రాణాలతో బ్రతికి ఉన్న వాళ్లను కాపాడటం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లుగా నైజర్ రాష్ట్రానికి దగ్గరగా ఉన్నటువంటి క్వారా రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. నది పడవ పొరుగున ఉన్న నైజర్ రాష్ట్రం నుండి క్వారా రాష్ట్రంలో ప్రజలను తీసుకువెళుతుండగా ఈఘటన జరిగినట్లు రాష్ట్ర పోలీసులు తెలిపారు. అయితే ఈప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఇప్పటి వరకు 103గా గుర్తించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా వెల్లడించారు. బోటు ప్రమాదంలో సుమారు 100 మందిని రక్షించామని క్వారా రాష్ట్ర పోలీసు ప్రతినిధి ఒకాసన్మి అజయ్ టెలిఫోన్ ద్వారా మీడియాకు తెలియజేశారు. మంగళవారం తెల్లవారు జామున3గంటలకు జరగడంతో మృతుల సంఖ్య పెరగడానికి కారణమైందని అధికారులు తెలిపారు. పడవ మునిగిన నైజర్ నదిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన బాధితులు, మృతులు నైజర్ స్టేట్‌లోని ఒక పెళ్లి నుండి క్వారాలోని పాటిగి జిల్లాకు తిరిగి వస్తున్నారని క్వారా స్టేట్ గవర్నర్ కార్యాలయం తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)