ప్రేమ వివాహాలు చేసుకున్నవారే ఎక్కువ శాతం మంది విడాకులు తీసుకున్నారు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 17 May 2023

ప్రేమ వివాహాలు చేసుకున్నవారే ఎక్కువ శాతం మంది విడాకులు తీసుకున్నారు !


ప్రేమ వివాహం చేసుకున్న జంటల్లోనే ఎక్కువ శాతం మంది విడాకులు తీసుకుంటున్నట్లు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. జస్టిస్ బీఆర్ గవాయి, సంజయ్ కారల్‌తో కూడిన ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వైవాహిక జీవితానికి సంబంధించిన ఓ కేసు ట్రాన్స్‌ఫర్ పిటీషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఆ సమయంలో ఆ పెళ్లి ప్రేమ వివాహం అని కోర్టుకు తెలిపారు. ఆ సందర్భంలో జస్టిస్ గవాయి స్పందిస్తూ  ఎక్కువ శాతం డైవర్స్ కేసులన్నీ లవ్ మ్యారేజ్ చేసుకున్నవారి నుంచే వస్తున్నాయని అన్నారు. అయితే ఆ కేసులో మధ్యవర్తిత్వాన్ని కోర్టు సూచించింది. కానీ దాన్ని భర్త వ్యతిరేకించారు. ఇలాంటి సందర్భంలో ఇటీవల వచ్చిన ఓ తీర్పును ఆధారంగా చేసుకుని, భర్త ఆమోదం లేకుండానే ఆ జంటకు విడాకులు ఇవ్వవచ్చు అని కోర్టు తెలిపింది. కానీ మధ్యవర్తిత్వం తప్పనిసరి అని ధర్మాసనం పేర్కొన్నది.

No comments:

Post a Comment