మన్‌ కీ బాత్‌ ఖర్చు ట్వీట్‌ పై దుమారం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 2 May 2023

మన్‌ కీ బాత్‌ ఖర్చు ట్వీట్‌ పై దుమారం !


మన్ కీ బాత్‌ ప్రోగ్రాం 100వ ఎపిసోడ్‌ను ఆదివారం బీజేపీ చాలా అట్టహాసంగా జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ తన నెలవారీ రేడియో కార్యక్రమం మన కీ బాత్‌ కోసం రూ. 8.3 కోట్లు ఖర్చు అవుతుందని, మొత్తంగా అన్ని ఎపిసోడ్‌లకు కలిపి రూ. 830 కోట్లు ఖర్చుపెట్టారంటూ ఒక ట్వీట్‌ దుమారం రేపింది. ఈ ట్వీట్‌ని గుజరాత్‌ ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకుడు గాధ్వీ చేశారు. దీంతో గాధ్వీపై ఏప్రిల్‌ 29న సైబర్‌ క్రై బ్రాంచ్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ప్రభుత్వం తరపును ఫిర్యాదుదారుగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎలాంటి విశ్వసనీయమైన డేటా లేకుండా గాధ్వి ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఆప్‌ బీజేపిపై ఫైర్‌ అయ్యింది. బీజేపీ రాజకీయ హత్యకు పాల్పడుతూ ఇలా తమ నాయకులపై కేసు నమోదు చేస్తున్నారంటూ ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఆప్‌ రాజ్యసభ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి రాఘవ్‌ చద్ధా మాట్లాడతూ కొత్త రోజు కొత్త ఎఫ్‌ఆర్‌ అంటూ ట్విట్టర్‌లో విమర్శించారు. దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. చిన్న రాజకీయ ట్విట్ పై తర్జభర్జన చేసినందుకే గాధ్విపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తే..పతకాలు గెలుచుకున్న రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ నాయకుడిని మాత్రం చూసి చూడనట్టు వదిలేశారు ఈ పోలీసులు అంటూ మండిపడ్డారు. ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద రెజ్లర్లు నిరసనలు చేసినా సదరు బీజేపీ నాయకుడిపై కేసు నమోదు చేయలేదని, సుప్రీం కోర్టుని ఆశ్రయించాక పోలీసులు కేసు నమోదు చేసిన విషయాన్ని చద్ధా గుర్తు చేశారు. ఇదిలా ఉండగా, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) ప్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ గాధ్వీ చేసిన ట్వీట్‌ని అవాస్తవమని, తప్పుదోవ పట్టించేదిగా ఉందని పేర్కొంది. వాస్తవానికి ఆ వైరల్‌ మెసేజ్‌లో చెప్పినట్లుగా ఒక్క ఎపిసోడ్‌కు రూ. 8.3 కోట్లు కాదని మొత్తం మన్‌కి బాత్‌ ఎపిసోడ్‌ల ప్రకటనల మొత్త ఖర్చు రూ. 8.3 కోట్లని వెల్లడించింది. ప్రతి ఎపిసోడ్‌కు ప్రకటనల మద్దతు ఉందని ఊహిస్తోంది అది తప్పు అని పీఐబీ పేర్కొంది. 

No comments:

Post a Comment