తమది చిన్న పార్టీ, తమను ఎవరూ సంప్రదించలేదు !

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల కౌంటింగ్ మొదలైంది. మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఈ నెల 10న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 73.19 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 36 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్లను లెక్కిస్తున్నారు. మొదట ఇంటి వద్ద నుంచి వేసిన ఓట్లను, పోస్టల్‌ బ్యాలెట్లను కౌంట్‌ చేశారు. మొత్తం 224 స్థానాల లో కౌంటింగ్ పూర్తి కాగా బిజెపి 86 కాంగ్రెస్ 114, జేడీ ఎస్ 21, చోట్ల లీడ్ సాధించాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్‌ ఫిగర్‌ అయిన 113 సీట్లు సాధించాల్సి ఉంటుంది. ఈసారి కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశం ఉందని పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించడంతో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే నిన్నటిదాకా తాము కింగ్ ల మనీ, కింగ్ మేకర్ కాదని చెప్పిన జెడిఎస్ పార్టీ అధినేత హెచ్డి కుమారస్వామి ప్రస్తుతం మాట మార్చారు. తమ పార్టీ చిన్న పార్టీ అని, తమను ఎవరూ సంప్రదించలేదని పేర్కొన్నారు. అంతేకాదు ప్రస్తుతం తమ అవసరం ఉండకపోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. తనకు అంత డిమాండ్ కూడా లేదని కుమారస్వామి అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)