రూ.2000 నోటు రద్దు చేస్తున్నాం అని ఆర్బీఐ ప్రకటన తరువాత దేశంలో నెలకొన్న గందరగోళ పరిస్థితిపై అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ అందుకే చదువుకున్న వ్యక్తి ప్రధాని అయితే ఇటువంటి పరిస్థితులు రావు అన్నది అంటూ ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అందుకే చదువుకోవాలని చెబుతున్నామని అన్నారు. ప్రధాని మోడీ విద్యార్హత గురించి కేజ్రీవాల్ ఇటీవల వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. నిరక్షరాస్యుడైన మోడీకి ఎవరైనా ఏమైనా చెప్పగలరా అంటూ ఎద్దేవా చేశారు. సీఎం అరవింద్ కేజ్రివాల్ ట్వీట్ చేస్తూ.2000నోటు తీసుకువస్తే అవినీతి ఆగిపోతుందని.. గతంలో నోట్ల రద్దుతో అవినీతి అంతమయ్యిందా అంటూ ప్రశ్నించారు. అందుకే ప్రధాని చదువుకోవాలని చెబుతున్నాం. నిరక్షరాస్యుడైన ప్రధాని, ఆయనకు ఏం చెప్పినా అర్థం కాదు. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడతారంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
पहले बोले 2000 का नोट लाने से भ्रष्टाचार बंद होगा। अब बोल रहे हैं 2000 का नोट बंद करने से भ्रष्टाचार ख़त्म होगा
इसीलिए हम कहते हैं, PM पढ़ा लिखा होना चाहिए। एक अनपढ़ पीएम को कोई कुछ भी बोल जाता है। उसे समझ आता नहीं है। भुगतना जनता को पड़ता है।
No comments:
Post a Comment