కిలో కందిపప్పు రూ.140 !

Telugu Lo Computer
0


మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు కందిపప్పు కొనే పరిస్థితి లేదనిపిస్తోంది. మార్కెట్ లో కిలో కందిపప్పు ధ అక్షరాల రూ.140 అదీ దొరికితే ! చాలా దుకాణాలు కందిపప్పుకి నో స్టాక్ బోర్డ్ పెట్టేస్తున్నారు. దేశంలో కందిపప్పు కొరత మొదలైంది. దాంతో దీని ధరకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో కందిపప్పు దర రూ.140 పలుకుతోంది. జూన్ నాటికి ఈ ధర మరింత పెరుగుతుందని అంటున్నారు. డిమాండ్ కు సరిపడా సరఫరా లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. 2022 లో దేశంలో 43.4 లక్షల టన్నుల పప్పు ధాన్యాలు పండగా.. ప్రస్తుతం 15 లక్షల టన్నులు మాత్రమే దిగుమతి అయ్యాయి. ఈ సంవత్సరం దిగుబడి 38.9 లక్షలు కూడా దాటకపోవడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల కాలంలో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామన్యులు ఆందోళన పడ్డారు. వీటికి తోడు ఇప్పుడు కందిపప్పు ధర కొండెక్కడంతో సామాన్యులు ఇప్పట్లో కందిపప్పు కొనే పరిస్థితి కనిపించడం లేదు. ఇక దుకాణుదారులు ఇదే అదనుగా ధరలు పెంచేసి విక్రయిస్తున్నారు. కొన్ని దుకాణాల్లో కందపప్పు నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. ఎండాకాలంలో కందిపప్పు వాడకం కాస్త తగ్గించినా వర్షాకలంలో దీని వినియోగం ఎక్కువగా ఉంటుంది. అప్పటికి కిలో రూ.180 వరకు ధర పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)