మధ్యంతర స్టే ఇచ్చేందుకు గుజరాత్‌ హైకోర్టు నిరాకరణ - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 2 May 2023

మధ్యంతర స్టే ఇచ్చేందుకు గుజరాత్‌ హైకోర్టు నిరాకరణ


పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు రాహుల్‌ గాంధీకి  గుజరాత్‌ హైకోర్టు నిరాకరించింది. తుది తీర్పును రిజర్వ్‌ చేసిన హైకోర్టు  జూన్‌ 4 తర్వాత ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. దీంతో పరువు నష్టం కేసులో హైకోర్టు ఆర్డర్‌ వచ్చే వరకు తన శిక్షపై స్టే విధించాలని రాహుల్‌ చేసిన ప్రయత్నం ఫలించలేదు. కాగా 2019 కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ ఇంటిపేరుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్‌ గాంధీ దోషిగా తేలడంతో సూరత్‌ కోర్టు రేండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. అలాగే దీన్ని పైకోర్టులో సవాల్‌ చేసేందుకు వీలుగా 30 రోజుల గడువు ఇస్తూ అప్పటి వరకు బెయిల్‌ మంజూరు చేసింది. అనంతరం పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో రాహుల్‌పై ఎంపీగా అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. అయితే ట్రయల్‌ కోర్టు ఈ కేసులో పారదర్శకంగా విచారణ చేపట్టకుండా కఠినంగా వ్యవహరించిందంటూ రాహుల్‌ గాంధీ సూరత్‌ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించారు. అయితే తనను దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును.. రెండేళ్ల జైలు శిక్షను రద్దు చేయాలని కోరుతూ రాహుల్‌ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఆయనకు బెయిల్‌ ముంజూరు చేసింది. అనంతరం ఏప్రిల్‌ 20న రాహుల్‌ అభ్యర్థనను సెషన్స్‌ కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఇదే కేసులో గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. గత బుధవారం గుజరాత్ హైకోర్టుకు చెందిన జస్టిస్ గీతా గోపి ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవడంతో జస్టిస్ హేమంత్ ప్రచ్చక్‌కి విచారణను అప్పగించారు.

No comments:

Post a Comment