12 గంటల పని చట్టం ఉపసంహరణ

Telugu Lo Computer
0


ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడే రోజునే 12 గంటల పని దిన చట్టాన్ని స్టాలిన్‌ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈమేరకు తమిళనాడు ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవడాన్ని సాహసోపేతమైన చర్యగా తమిళనాడు సిఎం స్టాలిన్‌ అభివర్ణించారు. కాగా, గత నెల ఏప్రిల్‌ నెలలో ద్రవిడ మున్నేట కజగం, మిత్రపక్షాలతో సహా పలు రాజకీయ పార్టీల నిరసనల వల్ల ఫ్యాక్టరీల చట్టం 1948ని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. అయితే ఈ చట్టాన్ని ఆమోదించడంపై కార్మిక సంఘాలు స్టాలిన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో ఈ చట్టాన్ని అమలుచేయకుండా తమిళనాడు ప్రభుత్వం నిలిపివేసింది. కాగా, మే డే రోజున ఈ చట్టంలోని పని గంటలకు సంబంధించిన 65-ఎ సెక్షన్‌ను ఉపసంహరించుకున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)