వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి

Telugu Lo Computer
0


ఉత్తర ప్రదేశ్ బరేలీలోని సిబీగంజ్ ప్రాంతంలో 12 ఏళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేసి చంపేశాయి. ఈ దాడిలో మరో చిన్నారికి గాయాలయ్యాయి. ఖాన గౌన్తియా గ్రామంలో తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న సమయంలో వీధికుక్కల గుంపు బాలుడిపై దాడి చేశాయి. ప్రాణాల కోసం పిల్లాడు భయపడి పరిగెత్తినా కుక్కలు విడిచిపెట్టలేదు. కిందపడేసి దాడి చేసి తీవ్రం గాయపరిచాయి. బాలుడి పరిస్థితిని చూసిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. బరేలీలో పిల్లలపై వీధికుక్కలు దాడి చేయడం ఇది మొదటిసారి కాదు. రెండు నెలల క్రితం వీధికుక్కలు దాడి చేయడంతో మూడేళ్ల బాలిక మృతి చెందింది. ఆమె తన ఇంటి బయట ఆడుకుంటుండగా కుక్కలు ఆమెను 150 మీటర్లు ఈడ్చుకెళ్లి చంపేశాయి. వీధికుక్కల బెదడపై బరేలీ ప్రజలు జిల్లా యంత్రాంగానికి, మున్సిపల్ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు.


Post a Comment

0Comments

Post a Comment (0)