మహిళపై సామూహిక అత్యాచారం !

Telugu Lo Computer
0


కర్ణాటకలో ఓ వివాహితపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు చికిత్స పొందుతూ మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్​ చేశారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం భాదితురాలు రాయ్​చూర్​ జిల్లాలోని సింధనూరులో టార్పాలిన్​ షీట్లు కుట్టుకుంటూ జీవిస్తోంది. ప్రధాన నిందితుడు మల్లప్ప బాధితురాలిలో ఇటీవలే స్నేహం పెంచుకున్నాడు. ఆ తర్వాత చాలాసార్లు శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేశాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో 23వ తేదీన మల్లప్ప ఆమెను బైక్​పై బలవంతంగా బయటకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి  బాధితురాలిపై మల్లప్ప సహా ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఇది గమనించిన గ్రామస్థుడు మహిళ కుమారుడికి సమాచారం అందించాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మహిళను సింధనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స నిమిత్తం బాధితురాలిని రాయచూర్‌లోని రిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె మే 24న మహిళ మృతి చెందింది. తన మరణానికి ముందు బాధిత మహిళ నిందితుల గురించి కుటుంబసభ్యులకు చెప్పింది. నిందితుడు మల్లప్ప సహా ముగ్గురు తనపై బలవంతంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. మహిళ ఇచ్చిన వాంగ్మూలం మేరకు కుమారుడు సింధనూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడు మల్లప్పను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


Post a Comment

0Comments

Post a Comment (0)