హైదరాబాద్‌ చేరిన ఐశ్వర్య మృతదేహం

Telugu Lo Computer
0


అమెరికాలోని టెక్సాస్‌లో నాలుగు రోజులక్రితం జరిగిన కాల్పుల్లో మరణించిన తాటికొండ ఐశ్వర్య మృతదేహం హైదరాబాద్‌కు చేరుకుంది. రంగారెడ్డి జిల్లా కమర్షియల్‌ కోర్టు న్యాయమూర్తి నర్సిరెడ్డి కూతురైన ఐశ్వర్య మూడేండ్ల క్రితం ఎంఎస్‌ చదవడం కోసం అమెరికాకు వెళ్లారు. అక్కడే ఎంఎస్‌ పూర్తయ్యాక పర్‌ఫెక్ట్‌ జనరల్‌ కాంట్రాక్టర్స్‌ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా పని చేస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం ఈ నెల 7న కుటుంబసభ్యులతో ఐశ్వర్య ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం సమీపంలోని ఓ షాపింగ్‌ మాల్‌కు వెళ్లారు. మాల్‌లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటంతో మొత్తం ఎనిమిది దుర్మరణం చెందారు. వారిలో ఐశ్వర్య కూడా ఉంది. గుర్తుపట్టలేనంతగా గాయపడిన ఐశ్వర్యను వేలిముద్రల ఆధారంగా అక్కడి పోలీసులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. యువతి స్వస్థలం తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల.

Post a Comment

0Comments

Post a Comment (0)