బీబీసీకి ఢిల్లీ హైకోర్టు సమన్లు !

Telugu Lo Computer
0


గుజరాత్ అల్లర్లకు సంబంధించి బీబీసీ.. 'ఇండియా: ది మోడీ క్వశ్చన్' పేరుతో ఓ డాక్యుమెంటరీని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ డాక్యుమెంటరీ ప్రధాని మోదీ, భారత న్యాయ వ్యవస్తను కించ పరిచే విధంగా ఉన్నందుకు కేంద్రం ఈ డాక్యుమెంటరీపై నిషేధం విధించింది. ఈ విషయంలో బీబీసీపై వేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. మోడీ డాక్యుమెంటరీపై బీబీసీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయో.. వాటన్నింటిని కోర్టులో ప్రవేశపెట్టాలని ధర్మాసనం ఆదేశించింది. దీనిపై విచారణను సెప్టెంబర్కు వాయిదా వేసింది. కాగా గుజరాత్ అల్లర్లపై బీబీసీ రెండు భాగాలుగా డాక్యుమెంటరీని ప్రసారం చేయడంతో వివాదం చెలరేగింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వత.. ఫిబ్రవరి నెలలో ఢిల్లీ, ముంబైలోని బీబీసీ ఆఫీసులపై ఇన్కమ్టాక్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ వెంటనే కొన్ని రోజుల్లోనే ఢిల్లీ హైకోర్టు బీబీసీకి సమన్లు జారీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)