నాతో పాటు వాళ్లు కూడా లై డిటెక్టర్ టెస్టులు చేయించుకోవాలి !

Telugu Lo Computer
0


భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మహిళా రెజ్లర్లపై ఆయన వేధింపులకు పాల్పడ్డారని పలువురు రెజ్లర్లు ఆరోపించారు. ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వారు ధర్నా కూడా చేశారు. ఈ నేపథ్యంలో బ్రిజ్ భూషణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని బ్రిజ్ భూషణ్ అన్నారు. నార్కోటెస్ట్ కానీ, పాలీగ్రాఫ్ టెస్ట్ కానీ, లైడిటెక్టర్ టెస్ట్ కానీ ఏ టెస్టుకైనా తాను సిద్ధమేనని చెప్పారు. అయితే తనతో పాటు రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పూనియాలు కూడా టెస్ట్ చేయించుకోవాలని కండిషన్ పెట్టారు. టెస్ట్ చేయించుకోవడానికి వాళ్లిద్దరూ సిద్ధమైతే మీడియా ముఖంగా ఆ విషయాన్ని వెల్లడించాలని, అప్పుడు తాను కూడా టెస్ట్ చేయించుకుంటానని చెప్పారు. మరోవైపు రెజ్లర్లకు నానాటికీ మద్దతు పెరుగుతోంది. హర్యానా రైతులు కూడా వీరికి సంఘీభావం ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)