భుట్టో మనవరాలు శివాలయంలో ప్రత్యేక పూజలు !

Telugu Lo Computer
0


పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో మనవరాలు ఫాతిమా భుట్టో వివాహం ఘనంగా జరిగింది. వివాహం అనంతరం ఈ జంట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం పాకిస్తాన్ చర్చకు దారి తీసింది.  ఈ విషయం  సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. కొంతమంది నెటిజన్లు ఫాతిమాను చాలా అభినందిస్తున్నారు. ఫాతిమా మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో మనమరాలు, ముర్తాజా భుట్టో కుమార్, వృత్తి రీత్యా రచయిత్రి, కాలమిస్ట్ అయిన ఫాతిమా భుట్టో శుక్రవారం అమెరికా పౌరుడు గ్రాహం (గిబ్రాన్)ని వివాహం చేసుకుంది. వివాహం అనంతరం ఆదివారం నాడు ఫాతిమా తన భర్తతో కలిసి కరాచీలోని చారిత్రాత్మక మహాదేవ్ ఆలయాన్ని సందర్శించారు. శివుడికి ప్రీతిపాత్రమైన పాలభిషేకం నిర్వహిచారు. రుద్రుడికి ప్రత్యేక పూజలు చేశారు. వీరు పూజలు చేస్తున్న ఫోటో ఒకటి షోషల్ మీడియాను కుదిపేసింది. అంతకుముందు, ఫాతిమా వివాహ వేడుకకు దేశ విదేశాంగ మంత్రి, బావ బిలావల్ భుట్టో దూరంగా ఉన్నారు. మీడియా కథనాల ప్రకారం, ఫాతిమా భర్త గ్రాహం క్రిస్టియన్, అమెరికన్ పౌరుడు. ఫాతిమాతో పాటు ఆమె సోదరుడు జుల్ఫికర్ అలీ భుట్టో జూనియర్, హిందూ నాయకులు కూడా ఉన్నారు. ఆలయంలో దర్శన సమయంలో ఫాతిమా కూడా మహాదేవునికి ఆవు పాలుతో అభిషేకం చేశారు. ఫాతిమా, ఆమె భర్త ఈ చర్యపై ప్రజలు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు లభించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)