అధిక పెన్షన్ అప్లై గడువు పెంపు

Telugu Lo Computer
0


అధిక పెన్షన్ కోసం అప్లై చేసుకోవడానికి గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. సాధారణంగా అధిక పెన్షన్ కోసం అప్లై చేసుకోవడానికి నేటితో గడువు ముగియాల్సి ఉంది. ఈ గడువును జూన్ 26 వరకు గడువు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈపీఎఫ్‌వో గడువు పొడిగించడం ఇది రెండవ సారి. సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో ఈపీఎఫ్‌వో జాప్యం చేసింది. దీంతో అధిక పెన్షన్ కోసం అప్లై చేసుకోవడానికి మే 3 డెడ్‌లైన్‌గా నిర్ణయించారు. అయితే ఇప్పుడు దీన్ని మరోసారి పొడిగిస్తూ ఈపీఎఫ్‌వో నిర్ణయం తీసుకుంది. 2014 సెప్టెంబర్ 1 కన్నా ముందు ఈపీఎఫ్ సభ్యులుగా ఉన్న వారికి మాత్రమే అధిక పెన్షన్ కోసం అప్లై చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అది కూడా అర్హత కలిగిన వారికే ఇది వర్తిస్తుంది. ఈపీఎఫ్‌వో తాజా నిర్ణయం నేపథ్యంలో అధిక పెన్షన్ కోసం అర్హత కలిగిన వారు అన్ని డాక్యుమెంట్లను సమకూర్చుకొని పెన్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు. కంపెనీ వద్ద ఉద్యోగి వేతనానికి సంబంధించిన వివరాలు లేకపోతే? అప్పుడు ఏం చేయాలి? అనే సమస్య అలానే కొనసాగుతోందని, దీనికి ఈపీఎఫ్‌వో పరిష్కారం చూపించాల్సి ఉందని ఈవై ఇండియా పీపుల్ అడ్వైజరీ సర్వీసెస్ పార్ట్‌నర్ పునీత్ గుప్తా తెలిపారు. అంతేకాకుండా తాజాగా పొడిగించిన గడువు అనేది కేవలం ఉద్యోగులకు అధిక పెన్షన్ కోసం అప్లై చేసుకోవడానికి మాత్రమే కల్పించారా? లేదంటే కంపెనీ అప్రూవ్ చేయడానికి కూడా గడువు పొడిగించారా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఇలా అస్పష్టమైన అంశాలు చాలానే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈపీఎఫ్‌వో 1.16 అదనపు కంట్రిబ్యూషన్ విధానాన్ని తీసుకువచ్చింది. అయితే సుప్రీం కోర్టు దీని స్థానంలో మరో కొత్త విధానాన్ని తీసుకురావాలని సూచించింది. అయితే ఇప్పటి వరకే ఈపీఎఫ్‌వో ఈ అంశంపై కూడా స్పష్టత ఇవ్వలేదని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)