బ్యూటీ పార్లర్‌లో యువతిని చితకబాదిన మహిళ !

Telugu Lo Computer
0


తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన సంగీత అనే 40 ఏళ్ల మహిళ మే 6న పూల మార్కెట్‌లోని ఓ బ్యూటీ పార్లర్‌కు జుట్టుకు రంగు వేయించుకోవటానికి వచ్చింది. పార్లర్‌లోని సోఫాలో కూర్చుని తన వంతుకోసం ఎదురు చూస్తూంది. అంతకంటే ముందే ఓ 23 ఏళ్ల యువతి బ్యూటీ పార్లర్‌కు వచ్చి, సోఫాలో సంగీతకు ఎదురుగా కూర్చుని ఉంది. తాను ముందు జుట్టుకు రంగు వేయించుకుంటానని, తనను ముందు వెళ్లనివ్వాలని సంగీత ఆ యువతిని కోరింది. ఆ యువతి ఇందుకు ఒప్పుకోలేదు. దీంతో గొడవ మొదలైంది. కొద్దిసేపటికే ఆ గొడవ కొట్టుకునే స్థాయికి వెళ్లింది. సంగీత ఆ యువతి మీద దాడి చేసింది. సెలూన్‌ సిబ్బంది, ఇతర కస్టమర్లు ఎంత వారిస్తున్నా వినకుండా యువతిపై చెయ్యి చేసుకుంది. జుట్టు పట్టుకుని చితకబాదింది. ప్రస్తుతం ఇందకు సంబంధించిన సీసీటీవీ కెమెరా దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సదరు మహిళపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)