'ది కేరళ స్టోరీ' దర్శకుడికి బెదిరింపులు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 9 May 2023

'ది కేరళ స్టోరీ' దర్శకుడికి బెదిరింపులు !


'ది కేరళ స్టోరీ' సినిమా దర్శకుడు సుదీప్తో సేన్‌కు, మూవీ టీమ్ లోని మరి కొందరికి గుర్తు తెలియని నంబర్ నుంచి బెదిరింపు మెసేజులు వచ్చాయి. 'ఒంటరిగా బయటకు వెళ్లొద్దు.. మీరు మంచి పనులు చేయలేదు' అని మెసేజ్‌లో ఓ వ్యక్తి బెదిరించాడు. దీనిపై సుదీప్తో సేన్‌ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ బెదిరింపులపై రాతపూర్వకంగా ఫిర్యాదు అందకపోవడంతో ప్రస్తుతానికి ఎఫ్‌ఐఆర్‌ నమోదుకాలేదు. అయితే ఆ సినిమా సిబ్బందికి మాత్రం పోలీసులు భద్రత కల్పించారు. ఈ సినిమాను కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రదర్శనను నిషేధిస్తున్నాయి. ఈ సమయంలో ఉత్తర ప్రదేశ్‌ మాత్రం ఈ సినిమాకు పన్ను మినహాయింపు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఇదివరకు మధ్యప్రదేశ్‌ కూడా ఈ మినహాయింపునిచ్చింది. ఇక పశ్చిమ బెంగాల్‌లో సినిమాపై నిషేధం విధించగా, దాన్ని తొలగించాలని కోరుతూ 'ది కేరళ స్టోరీ' మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పశ్చిమ బెంగాల్‌తోపాటు తమిళనాడు అంతటా సినిమాను ప్రదర్శించే థియేటర్ల వద్ద భద్రత కల్పించాలని మేకర్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 

No comments:

Post a Comment