వేసవి కాలం - తీసుకోవాల్సిన ఆహారం !

Telugu Lo Computer
0


వేసవి కాలంలో  ప్రేగు ఆరోగ్యాన్ని దెబ్బతీసే అనేక అంశాలను కలిగి ఉంది. వేడిని తాళలేక చాలా మంది చల్లని పదార్థాలు తీసుకుంటారు, చక్కెర పానీయాలు, చల్లటి బీర్లు వంటి వాటికోసం ఆరాటపడతారు. ఇవి తీసుకునేటపుడు బాగానే అనిపిస్తుంది కానీ, కడుపులోకి వెళ్లిన తర్వాత ఇబ్బందిని కలిగిస్తాయి. తీసుకునే ఆహార పానీయాలలోని కృత్రిమ పదార్ధాలు, సంతృప్త కొవ్వులు మీ ప్రేగు ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతాయి. ఆకలిదప్పికల కోరికలకు లొంగిపోకుండా వేసవికి అనుకూలమైన ఆహారంను తీసుకోవాలి. ఆహారంలో సరైన ప్రోబయోటిక్స్, మజ్జిగ , సత్తు వంటివి కొంచెం అదనంగా తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యం బాగుంటుంది. ఇవి వేసవిలో చల్లగా ఉంచడంతో పాటు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. వేసవిలో తరచుగా పెరుగు అన్నం తినడం అలవాటు చేసుకోండి. వేసవి వేడిని తట్టుకుని నిలబడాలన్నా, మీ కడుపుని ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నా పెరుగు అన్నం చాలా మంచి ఆహారం. ప్రోబయోటిక్స్‌తో నిండిన ఈ ఆహారం, జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో కాల్షియం, ప్రోటీన్లకు మంచి మూలం కాబట్టి, పెరుగన్నం మీ ఎముకలు , కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది, మీకు మంచి శక్తిని అందిస్తుంది. వేడిని అధిగమించగల ఆహారాన్ని తినవలసి ఉంటుంది. తృణధాన్యాలు మీకు చాలా అవసరమైన పోషణను అందిస్తాయి, మంచి పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోండి. సాధారణ దాల్ రైస్ తింటూ ఉండండి, సాంప్రదాయ ధాన్యాలు కాకుండా బార్లీ, రాగి వంటివి తీసుకోండి. తృణధాన్యాలు మంటను తగ్గించడమే కాకుండా మంచి బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తాయి.  పేగును చల్లగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే ఒక గ్లాసు మజ్జిగ తాగండి. పెరుగును నీటితో చిలికి మజ్జిగ తయారుచేస్తారు. మజ్జిగ అనేది ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే పానీయం. జీర్ణక్రియ మెరుగుపరచడంలో, ఉబ్బరం, మలబద్ధకం నివారించడంలో సహాయపడుతుంది. మజ్జిగలో కేలరీలు తక్కువ ఉంటాయి, అవసరమైన విటమిన్లు, ఖనిజాలను ఎక్కువ కలిగి ఉంటుంది. ఓట్స్‌లో వివిధ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఓట్ మీల్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీరు చాలా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. ఇది ఆరోగ్యకరమైన గట్ బాక్టీరియాను పునరుద్ధరిస్తుంది, మీరు చాలా కాలం పాటు కడుపునిండిన అనుభూతిని కలిగిస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)