హైదరాబాద్‌లో ఊపందుకున్న గృహ నిర్మాణాలు !

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లో ఇండ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. 2022తో పోల్చితే 2023లో 104 శాతం వృద్ధిరేటు ఉంటుందని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ విశ్లేషణ సంస్థ అనరాక్‌ తన తాజా నివేదికలో వెల్లడించింది. హైదరాబాద్‌సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇండ్ల నిర్మాణాలు, విక్రయాలపై అనరాక్‌ అధ్యయనాన్ని నిర్వహించింది. ఏడు నగరాల్లోని మొత్తం స్టాక్‌లో హైదరాబాద్‌ 4% వాటా కలిగిఉందని అనరాక్‌ గ్రూప్‌ వైస్‌ చైర్మన్‌ సంతోష్‌ కుమార్‌ తెలిపారు. ఈ ఏడాది ఏడు నగరాల్లో సుమారు 5.6 లక్షల ఇండ్లు డెలివరీ చేసే అవకాశం ఉందన్నారు. ఇది గతేడాదితో పోల్చితే 39% పెరుగుదల నమోదు చేయనుందని తెలిపారు. ప్రాజెక్టుల ఆలస్యం కారణంగా ఇన్‌పుట్‌ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో సకాలంలో వాటిని పూర్తి చేసేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)