బ్రిజ్‌ భూషణ్‌ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నాం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 23 May 2023

బ్రిజ్‌ భూషణ్‌ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నాం !


బ్రిజ్‌ భూషణ్‌ సవాల్‌ను ఢిల్లీలో నిరసన తెలుపుతున్న అగ్రశ్రేణి రెజ్లర్లు స్వీకరించారు. ఆదివారం రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షులు, బిజెపి ఎంపి బ్రిజ్‌ భూషణ్‌ తనతోపాటు వినేష్‌ ఫోగట్‌, బజరంగ్‌ పూనియాలకు నార్కోటెక్‌ పరీక్ష చేయించుకోవాలని డిమాండ్‌ చేశారు. వినేష్‌ ఫోగట్‌, బజరంగ్‌ పునియా మాత్రమే కాకుండా మైనర్‌ రెజ్లర్‌ సహా ఏడుగురు ఫిర్యాదుదారులు కూడా తనిఖీకి సిద్ధంగా ఉన్నారని నిరసనకారులు మీడియాకు తెలిపారు. ఈ పరీక్షను దేశం ముందు ప్రత్యక్ష ప్రసారం చేయాలని వినేష్‌ ఫోగట్‌ డిమాండ్‌ చేశారు. బిజెపి ఎంపి నుంచి బాలికలు ఎదుర్కొంటున్న బాధలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. ఈ పరీక్షలు సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని కూడా ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. అబద్ధాలు ఆడుతున్న బ్రిజ్‌భూషణ్‌ ప్రజలను తప్పుదోవ పట్టించడం మానేయాలని బజరంగ్‌ పూనియా కోరారు. మంగళవారం సాయంత్రం ఇండియాగేట్‌లో నిర్వహించనున్న క్యాండిల్‌లైట్‌ మార్చ్‌, 28న నూతన పార్లమెంట్‌ ముట్టడి నిరసనపై పోలీసులు బలప్రయోగం చేయొద్దని క్రీడాకారులు అభ్యర్థించారు. ఆందోళన శాంతియుతంగా ప్రారంభమైందని వినేష్‌ ఫోగట్‌ తెలిపారు. 28న పార్లమెంట్‌ ముట్టడి నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని పోలీసులు నిర్ణయించారు.

No comments:

Post a Comment