వైట్ హౌస్ వద్ద ట్రక్కు బీభత్సం !

Telugu Lo Computer
0


అమెరికా వైట్ హౌస్ సమీపంలోని లాఫేట్ స్క్వేర్ వద్ద ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. రాత్రి అతివేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు సెక్యూరిటీ బారికేడ్లను ఢీ కొట్టింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు యూఎస్ సీక్రెట్ సర్వీస్ చీఫ్ కమ్యూనికేషన్స్ ఆంథోనీ గుగ్లిల్మీ తెలిపారు. ఈ ప్రమాదం తర్వాత ముందుజాగ్రత్త చర్యగా కొన్ని రోడ్లు, నడకదారులను మూసివేసినట్టు సీక్రెట్ సర్వీస్ తెలిపింది. అంతేకాదు, సమీపంలో ఉన్న హే ఆడమ్స్ హోటల్‌ను అధికారులు ఖాళీ చేయించారు. ట్రక్కు డోరును రిమోట్ రోబో సాయంతో తెరిచారు. అందులో అనుమానాస్పద వస్తువులు ఏవీ లేవని భద్రతా సిబ్బంది గుర్తించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)