దేశవ్యాప్తంగా వంద జిల్లాల్లో వంద ఫుడ్ స్ట్రీట్​ల ఏర్పాటు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 4 May 2023

దేశవ్యాప్తంగా వంద జిల్లాల్లో వంద ఫుడ్ స్ట్రీట్​ల ఏర్పాటు !


కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్మిస్తున్న ఫుడ్​స్ట్రీట్​లపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వంద జిల్లాల్లో వంద ఫుడ్ స్ట్రీట్​లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు, ఒక్కో ఫుడ్ స్ట్రీట్​కు కోటి రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన పనుల అభివృద్ధిపై ఆరా తీశారు. పరిశుభ్రమైన, సురక్షితమైన ఆహార పద్ధతుల ను ప్రోత్సహించడానికే కేంద్రం ఈ ఫుడ్​స్ట్రీట్​ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వీటి ఏర్పాటుపై కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేశ్​భూషణ్, కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెక్రటరీ మనోజ్ జోషి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పైలట్​ ప్రాజెక్టుకు సంబంధించి లేఖ రాశారు. 

No comments:

Post a Comment