కేదర్‌నాథ్‌లో మంచు వర్షం..! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 2 May 2023

కేదర్‌నాథ్‌లో మంచు వర్షం..!


హిమాలయ రీజియన్‌లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షంతో పాటు మంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లా మెజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ అప్రమత్తమయ్యారు. కేదర్‌నాథ్ ఆలయానికి వచ్చే భక్తులకు మెజిస్ట్రేట్ పలు సూచనలు చేశారు. భక్తులు ఒకే చోట ఉండాలని సూచించారు. ప్రస్తుతం కేదర్‌నాథ్ ధామ్‌లో మంచు కురుస్తుందని తెలిపారు. ఉదయం 10:30 గంటల తర్వాత సోన్‌ప్రయాగ్ నుంచి కేదర్‌నాథ్‌కు భక్తుల రాకపోకలను నిలిపివేస్తామని ప్రకటించారు. జిల్లా యంత్రాంగానికి భక్తులు సహకరించాలని మెజిస్ట్రేట్ విజ్ఞప్తి చేశారు. వాతావరణం పూర్తిగా చక్కబడిన తర్వాతనే కేదర్‌నాథ్‌కు భక్తులను అనుమతిస్తామని స్పష్టం చేశారు. 

No comments:

Post a Comment