ఎండల్లో కాసే యాపిల్స్ ?

Telugu Lo Computer
0


గుజరాత్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ అధికారులు, పరిశోధనా సంస్థలు, శాస్త్రవేత్తలు, నిపుణులూ కలిసి.. రకరకాల ప్రయోగాలు చేస్తూ... రైతులతో ఆధునిక వ్యవసాయం చేయిస్తున్నారు. ఇలాంటి ప్రయోగాత్మక పంటలకు ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ , జమ్మూకాశ్మీర్‌తోపాటూ బీహార్ మైదాన ప్రాంతాలలో పెరిగే వివిధ రకాల ఆపిల్‌లను సరికొత్తగా గుజరాత్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.  ఈ రకమైన యాపిల్ హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ , జమ్మూకాశ్మీర్‌తో పాటు దేశంలోని అనేక మైదాన ప్రాంతాలలో పెరుగుతున్నాయి. బీహార్‌లోని కొందరు రైతులు ఈ రకమైన యాపిల్ సాగును ప్రారంభించారు. ఈ యాపిల్ రకానికి హరిమాన్ 99 అని పేరు పెట్టారు. ఇది పొడి, వేడి ప్రాంతాలలో కూడా సులభంగా పెరుగుతుంది. ఈ హరిమాన్ 99 రకాల యాపిల్‌ను పండించడం ద్వారా బీహార్ రైతులు భారీ ఆదాయాన్ని పొందుతున్నారు. ఇప్పుడు బీహార్‌లో చాలా మంది రైతులు ఈ రకమైన యాపిల్ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రకం యాపిల్‌లో రైతులకు మొదటి సంవత్సరం నుంచే పండ్లు రావడం ప్రారంభమవుతుందనీ, ఉత్పత్తి కూడా బాగా ఉంటుందని చెబుతున్నారు. అంతే కాకుండా మార్కెట్‌లో ఈ జాతికి చెందిన యాపిల్స్‌ ధర కూడా బాగానే ఉంది. అయితే ఈ యాపిల్ సాగును ప్రారంభించినప్పుడు, మొదట్లో చెట్టుకు 5-10 కేజీల పండ్లు మాత్రమే లభిస్తాయి. ఈ జాతికి చెందిన చెట్టు నాటిన 25 ఏళ్ల పాటు రైతులకు ఫలాలను ఇస్తూనే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా... ఈ జాతికి చెందిన యాపిల్ చెట్టు 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలను తట్టుకొని జీవించగలదని శాస్త్రవేత్తలు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)