చిరుతలను రాజస్థాన్ ‎కి తరలించండి !

Telugu Lo Computer
0


దక్షిణాఫ్రికా నమీబియా నుండి మధ్యప్రదేశ్‌‎లోని కూనో నేషనల్ పార్క్‎కి వచ్చిన 20 చీతాలలో రెండు నెలల వ్యవధిలో మూడు చిరుతలు మరణించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది. రాజకీయాలకు అతీతంగా వాటిని రాజస్థాన్‌కు తరలించాలని న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, సంజయ్ కరోల్‌లతో కూడిన ధర్మాసనం సుప్రీంకోర్టు  కేంద్రాన్ని కోరింది. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న చిరుతలకు కూనో నేషనల్ పార్క్ సరిపోదని నిపుణుల నివేదికలు , కథనాలు వస్తున్న క్రమంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను చేసింది. "రెండు నెలల్లోపు మూడు చిరుతలు మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. నిపుణుల అభిప్రాయాలు, మీడియాలో కథనాలు ఎన్నో వస్తున్నాయి. ఇన్ని చిరుతలకు కూనో నేషనల్ పార్క్ సరిపోదని అనిపిస్తోంది. రాజస్థాన్‌లో అనువైన స్థలం కోసం మీరు ఎందుకు వెతకరు? కేవలం రాజస్థాన్‌ను ప్రతిపక్ష పార్టీ పాలిస్తున్నందున మీరు దానిని పరిగణనలోకి తీసుకోవడం లేదా" అని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్రించింది. కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి మాట్లాడుతూ.." టాస్క్‌ఫోర్స్ మరణించిన చిరుతలను స్వాధీనం చేసుకుంది. వాటిని ఇతర అభయారణ్యాలకు తరలించడం సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోంది"అని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)