ఐఆర్ సీటీసీ భారత్ గౌరవ్ రైలు టూర్ ప్యాకేజీ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 19 May 2023

ఐఆర్ సీటీసీ భారత్ గౌరవ్ రైలు టూర్ ప్యాకేజీ !


సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలుకు  ఐఆర్ సీటీసీ మే 18న మరో కొత్త పర్యాటక ప్యాకేజీని ప్రకటించింది. వైష్ణోదేవి ఆలయంతో పాటు హరిద్వార్, రిషికేష్ యాత్రను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 10న ప్రారంభం కానున్న ఈ యాత్ర మొత్తం 8 రాత్రులు, 9 రోజుల టూర్ ప్యాకేజీ. జూన్ 10వ తేది అర్థరాత్రి 12.30 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి రైలు బయలుదేరుతోంది. యాత్రకు వెళ్లేవారు కాజీపేట్, పెద్దపల్లి, రామగుండం, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్‌షా, వార్ధా, నాగ్‌పూర్ రైల్వే స్టేషన్లలో కూడా ఈ టూరిస్ట్ రైలు ఎక్కొచ్చు. పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లోని ఆధ్యాత్మిక క్షేత్రాలను ఈ యాత్ర కవర్ చేస్తోంది.  కటారా నుండి ఆలయానికి పోనీ లేదా డోలీ లేదా హెలికాప్టర్ సర్వీస్ ద్వారా వెళ్లాలనుకునే పర్యాటకులు వారి స్వంతంగా బుక్ చేసుకోవాలి. సికింద్రాబాద్ - ఆగ్రా - మధుర - బృందావన్ - కత్రా (వైష్ణోదేవి) - హరిద్వార్ - రిషికేశ్ - సికింద్రాబాద్. జూన్ 10 అర్థరాత్రి 12 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభం. 8 రాత్రులు/9 రోజులు (జూన్ 10 నుండి 18 వరకు)  బోర్డింగ్ / డి బోర్డింగ్ స్టేషన్లు - సికింద్రాబాద్, కాజీపేట్, పెద్దపల్లి, రామగుండం, సిర్పుర్కాగజ్ నగర్, బల్హర్షా, వార్ధా , నాగ్పూర్. ఎకానమీ కేటగిరీ (SL): రూ. 15,435. స్టాండర్డ్ కేటగిరీ (3AC): రూ. 24,735. కంఫర్ట్ కేటగిరీ (2AC): రూ. 32,480.

No comments:

Post a Comment