పోలీస్ స్టేషన్‌లోనే మందుకొట్టిన వ్యక్తి !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లో ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో మందు కొట్టాడు. ఈ ఘటనలో ఆ పోలీసు స్టేషన్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేశారు. షహరాన్‌పూర్‌ పోలీస్ స్టేషన్ ఇంచార్జి చైర్‌లో కూర్చుని ఓ వ్యక్తి మందు సీసాతో గ్లాసులో మందు పోస్తున్న ఓ ఫోటో వైరల్ అయ్యింది. ఈ ఘటనలో ఆ స్టేషన్ ఇంచార్జ్‌ను సస్పెండ్ చేశారు. ఫోటోలో ఉన్న వ్యక్తిని ఇమ్రాన్‌గా గుర్తించారు. ఇంచార్జ్ ఆఫీసర్ సచిన్ త్యాగి చైర్‌లో కూర్చున్న అతను గ్లాసులో మందు పోస్తూ కనిపించాడు. టేబుల్‌పై చక్నా ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు కూడా ఉన్నాయి. మార్చిలో హోలీ పండుగ సమయంలో ఈ ఘటన జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ఫోటో వైరల్ కాగానే.. ఇంచార్జి సచిన్ త్యాగిపై ఎస్పీ విపిన్ తాడా సస్పెన్షన్ వేటువేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)