కళ్ల ఎరుపు - ఇంటి చిట్కాలు !

Telugu Lo Computer
0


సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. మనిషి శరీరంలో అత్యంత ముఖ్యమైనవి కళ్లు. జ్ఞానేద్రియాల్లో ఒకటైన కళ్లను కాపాడుకోవడం చాలా ముఖ్యం. శరీరంలో అత్యంత సున్నితమైన అవయవం ఇది. కంటి సమస్యలు చాలా ఆందోళనతో పాటు ఒత్తిడిని కలిగిస్తాయి. కంటి సమస్యలు రోజువారీ పనికి అడ్డంకిగా మారతాయి. కంటి సమస్యలు సీజన్‌తో పని లేకుండా ఎప్పుడైనా రావచ్చు. కంటిలోని చిన్న రక్తనాళాలు ఎర్రబడినప్పుడు లేదా నాళాలు వాచినప్పుడు కళ్లు ఎర్రబడతాయి. కళ్ళు ఎర్రబడటానికి అనేక కారణాలు ఉన్నాయి. కంటి చికాకు, నిద్ర లేమి, కళ్లపై అధిక ఒత్తిడి వల్ల కళ్లు ఎర్రబడవచ్చు. కళ్ళు ఎర్రబడటానికి మరికొన్ని కారణాలు ఉన్నాయి. దుమ్ము, పొగ, కన్నీళ్లు రాకపోవడం, కనురెప్పలు చెడిపోవడం, కంటి చికాకు వంటివి సమస్యకు కారణమవుతాయి. కళ్లు ఎర్రగా మారితే తలెత్తే ఇబ్బంది నుంచి ఉపశమనం పొందడానికి ఇంటి దగ్గరే ఉంటూ కొన్ని చిట్కాలు, హోమ్‌ రెమిడీస్‌ పాటిస్తే ఆ సమస్యకు ఇట్టే పరిష్కారం లభిస్తుంది. కళ్లు ఎర్రబడి సమస్య తీవ్రంగా ఉంటే కంటి వైద్యులు, నిపుణులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి. అలోవెరా జెల్ కళ్ల వాపును తగ్గిస్తుంది. ఇది కళ్ళు ఎర్రబడటం సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. కళ్లలో వాపు సమస్యను తగ్గిస్తుంది. కలబందలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అలోవెరా జెల్ లేదా జ్యూస్‌ని కళ్లపై రాస్తే సరిపోతుంది. కొబ్బరి నూనెలో విటమిన్ కె, విటమిన్ ఇ, కాల్షియం మరియు ఐరన్ ఉన్నాయి. ఇది కళ్ళలో పొడి మరియు చికాకు నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. కన్ను ఎర్రగా ఉబ్బి ఉంటే చిన్న ఐస్ ముక్కను శుభ్రమైన గుడ్డలో చుట్టి కంటిపై ఉంచండి.

Post a Comment

0Comments

Post a Comment (0)