ఒక వ్యక్తిని అరెస్టు చేయాలంటే దేశ సరిహద్దు భద్రతా దళాలు అవసరమా ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో గురువారం జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఒక వ్యక్తిని అరెస్టు చేయాలంటే దేశ సరిహద్దు భద్రతా దళాలు అవసరమా అంటూ ప్రశ్నించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఒక హంతకున్ని మేము విచారణ చేస్తామంటే పోలీస్ వ్యవస్థ చేతులెత్తేసింది. ఒక ఎస్పీ నాకు చేతకాదు అనేశాడు. అదే నేను ఒక చిన్న ట్రాక్టర్ రిపేరు చేయిస్తుంటే హౌస్ అరెస్ట్ చేశారు. ఇలా ఉంది ఏపీలో పోలీసు వ్యవస్థ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఫలానా వాళ్లే హత్య చేశారని ఎవరు చెప్పడం లేదు. వాళ్లే హత్య కేసును విచారించేందుకు సీబీఐకి అప్పగించారు. ఇప్పుడు సీబీఐ విచారణకు రమ్మంటే వెళ్లడం లేదు. రాష్ట్రంలోని ప్రజలు చాలా కష్ట కాలంలో ఉన్నారు. ప్రశ్నించే సమాజాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)