చాదర్‌ఘాట్ లో దొరికిన తల నర్సు అనూరాధది !

Telugu Lo Computer
0


గత వారం హైదరాబాద్ మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసీ నది సమీపంలో మొండెం లేని తల లభించడం కలకలం రేపింది. ఈ తలకు సంబంధించిన మిస్టరీని పోలీసులు చేదించారు. తల ఎవరిదన్నది తెలుసుకోవడానికి పోలీసులు ఎనిమిది  బృందాలను రంగంలోకి దించి దర్యాప్తు చేపట్టారు. తలను పోస్టర్లుగా ముద్రించి దాని సాయంతో ఆరా తీశారు. అలాగే నగరంలో మిస్సింగ్ కేసులను కూడా విశ్లేషించారు. ఈ క్రమంలోనే ఆ తల నర్సు అనూరాధదిగా పోలీసులు గుర్తించారు. ఆమె కేర్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుండేది. ఇదిలా ఉంటే అనూరాధను హత్య చేసిన దుండగులు ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రీజ్‌లో దాచినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్యకు గల కారణలు ఇంకా తెలియాల్సి ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)