మరమరాలు - ఆరోగ్య ప్రయోజనాలు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 24 May 2023

మరమరాలు - ఆరోగ్య ప్రయోజనాలు !


పిల్లలు, పెద్దలు కాలక్షేపంగా తినే పదార్థాలలో మరమరాలు కూడా ఒకటి. బొరుగులు, ముర్ముర్లు, మురీలు అనే పేర్లతో కూడా ప్రసిద్ధి చెందిన ఈ మరమరాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే వీటిని ఎన్నో తరాలుగా మన పెద్దలు తింటూ వస్తున్నారని వారు వివరిస్తున్నారు. బియ్యానికి అధిక పీడనాన్ని అందించడం ద్వారా మరమరాలను తయారు చేస్తారన్న సంగతి తెలిసిందే. అందుకే వీటిని పఫ్‌డ్‌ రైస్‌ అని కూడా అంటారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే బియ్యంతో చేసిన అన్నంలో ఉన్న పోషకాలు అన్నీ కూడా ఇందులోనూ ఉంటాయి. ఇంకా ఈ మరమరాలతో స్వీట్లు, పాయసం, టిఫిన్లు కూడా చేసి తింటుంటారు. ఇక వీటిని తింటే బరువు తగ్గడంతో పాటు, ఆరోగ్యం ఉంటారు. మరమరాలు చాలా తేలినకైన ఆహారం, ఇంకా వీటిలో తక్కువ కేలరీలు ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు ఇవి కీలకంగా సహాయపడతాయి. 100 గ్రాముల మరమరాలు తీసుకుంటే 17 గ్రాముల ఫైబర్‌ అందుతుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. మరమరాలలో విటమిన్‌ డి, బి, క్యాల్షియం, ఐరన్‌ వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలోనే ఉంటాయి. ఈ పోషకాలన్నీ ఎముకలు, దంతాల దృఢత్వానికి కీలకపాత్ర వహిస్తాయి. ప్రమాదవశాత్తు ఎముకలు విరిగితే వీటిని తీసుకోవడం చాలా మంచిది. అధిక రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్‌ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్లు తరచూ మరమరాలను తీసుకోవడం వాటి నుంచి దూరంగా ఉండొచ్చు. సోడియం తక్కువగా ఉండే మరమరాలను నిత్యం తీసుకుంటే రక్తపోటు స్థిరంగా ఉంటుంది. ఇంకా గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది. మరమరాల్లో కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల వీటిని కాసిని తిన్నా కావలసిన శక్తి సమకూరుతుంది. కాబట్టి ఆహారం మితంగా తీసుకోవాలనుకునే డయాబెటీస్‌ వ్యాధిగ్రస్తులకూ మరమరాలు మంచివే. మరమరాల్లో ఉండే పోషక విలువలు పిల్లల ఎదుగుదలకు, వారికి కావలసిన పోషకాలను అందించడంలో ఎంతగానో తోడ్పడతాయి. వారి మెదడుకు చురుకుదనాన్ని కలిగిస్తాయి. పిల్లలో రక్తహీనత సమస్య సాధారణంగా కనిపిస్తుంటుంది. అలాంటి వారి డైట్‌లో మరమరాలను చేర్చడం ఎంతో ఉత్తమం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మరమరాల్లో ఐరన్‌ కంటెట్‌ పుష్కలంగా ఉంటుంది. వీటిని పిల్లలకు క్రమంతప్పకుండా ఇస్తే రక్తం వృద్ధి చెందుతుంది.

No comments:

Post a Comment