కోటీశ్వరుడైన బస్సు డ్రైవర్ !

Telugu Lo Computer
0


ఇంగ్లాండ్ లోని లీసెస్టర్ నగరంలో 51 ఏళ్ల బస్సు డ్రైవర్  స్టీవ్ గుడ్విన్ ప్రయాణ సమయంలో కబాబ్ దుకాణం వద్ద బస్సును ఆపి చికెన్ కబాబ్‌ను ఆర్డర్ చేశాడు. చికెన్ కబాబ్ కు సమయం పడుతుందని చెప్పటంతో  టైం పాస్ కోసం సమీపంలోని లాటరీ షాపులో టికెట్ కొన్నాడు. దీంతో అతనికి ఏకంగా రూ.10 కోట్ల 25 లక్షల విలువైన లాటరీ తగిలింది. స్టీవ్ తన లాటరీ నంబర్ 73 అని చెప్పాడు. ఇంత పెద్ద మొత్తంలో గెలుస్తానని అనుకోలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కానీ, లాటరీ కార్యాలయ సిబ్బంది తనకు కాల్‌ చేసినప్పుడు షాక్‌కు గురయ్యానంటూ చెప్పుకొచ్చాడు. స్టీవ్‌ ముందుగా ఈ శుభవార్తను తన తల్లితో పంచుకున్నాడట. కానీ, మొదట్లో ఎవరూ నమ్మలేదని చెప్పాడు. ఆ తర్వాత అదంతా నిజమేనని అందరూ గ్రహించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, లాటరీని గెలుచుకున్న తర్వాత కూడా స్టీవ్ ఇప్పటికీ బస్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)