లోక్‌సభ సభాపతి ఆసీనం వద్ద రాజదండాన్ని ఉంచనున్న ప్రధాని ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 25 May 2023

లోక్‌సభ సభాపతి ఆసీనం వద్ద రాజదండాన్ని ఉంచనున్న ప్రధాని !


ప్రధాని నరేంద్ర మోడీ భారత కొత్త పార్లమెంట్ భవనానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా మరచిపోయిన, పాతిపెట్టిన చరిత్రను పునరుద్ధరించడం కూడా జరుగుతుంది. మే 28న చారిత్రక బంగారు రాజదండాన్ని స్పీకర్ కుర్చీ వద్ద ప్రధాని స్థాపించనున్నారు. రాజదండాన్ని తమిళంలో 'సెంగోల్' అంటారు. అది భారత దేశ ఆవిర్భవం సందర్భంగా చారిత్రక ప్రత్యేకతను కలిగి ఉంది. 1947లో అధికారం బ్రిటిష్ వారి నుంచి భారతీయులకు బదిలీ అయినప్పుడు ఈ రాజదండానికి ఒక ప్రత్యేకత ఏర్పడింది. కొత్త పార్లమెంట్ భవనంలో రాజదండాన్ని ప్రవేశపెట్టనున్నారు. బ్రిటీష్ పాలన అంతమై ఇం డియాకు స్వాతంత్ర్యం వచ్చే ముందు అప్పటి వైస్రాయ్ మౌంట్ బాటన్ మన తొలి ప్రధాని నెహ్రూకి ఇచ్చారు. అధికార మార్పిడికి ఇది చిహ్నంగా నిలిచింది. బంగారు రాజదండాన్ని 'సెంగోల్' అని పిలుస్తారు. సెంగోల్ అంటే తమిళంలో ధర్మం అని అర్థం. 28వ తేదీన పార్లమెంట్ భవ నం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ స్పీకర్ పక్కన దీన్ని ఆవిష్కరించనున్నారు. ఐదు అడు గుల పొడవు ఉండే సెంగోల్​పై న్యాయానికి ప్రతీక అయిన నంది, ఎద్దు ఉంటాయి. ఈ రాజదండం ప్రస్తుతం అలహాబాద్​లోని మ్యూజియంలో ఉం ది. దీన్ని త్వరలోనే ఢిల్లీకి తీసుకురానున్నారు. సెంగోల్ చరిత్రను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా బుధ వారం వెల్లడించారు. ''ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​లో భాగంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. బ్రిటీష్ నుంచి భారతీయులకు అధికార మార్పిడికి చిహ్నంగా వచ్చిన బంగారు రాజదండాన్ని తిరిగి ప్రవేశపెడ్తారు. ఈ రాజదండాన్ని 'సెంగోల్' అంటారు. తమిళ పదమైన సెమ్మాయ్‌ (ధర్మం) నుంచి 'సెంగోల్' అనే పదం వచ్చింది'అని అమిత్​షా వెల్లడించారు. 1947, ఆగస్టు 14న రాత్రి 11:45 గంటలకు ఇండియన్స్​కు అధికార మార్పిడి జరిగిందని చెప్పుకునేందుకు గుర్తుగా ఈ రాజదండాన్ని తొలి ప్రధాని నెహ్రూకి లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ అందజేశారని అమిత్​షా గుర్తు చేశారు. కొత్త పార్లమెంట్‌లో సెంగోల్​ను ఏర్పాటు చేయడం తో మన సంస్కృతీ సంప్రదాయాలను నేటి ఆధునికతకు జోడించే ప్రయత్నం మోడీ చేశారని అమిత్ ​షా అన్నారు. ''సెంగోల్ అలహాబాద్‌లోని మ్యూజియంలో ఉంది. దాన్ని కొత్త పార్లమెంట్​కి తీసుకొస్తాం. చట్టబద్ధంగా పరిపాలన సాగించాలని కోరుకుంటున్నాం. ఆ చారిత్రక రాజదండం ఎల్లప్పుడూ మాకు దీన్ని గుర్తు చేస్తుంది'అని అమిత్​షా అన్నారు. మరిచిపోయిన చరిత్రను గుర్తు చేసే ప్రయత్నంలో భాగంగా ఈ చారిత్రత్మక రాజదండంపై దృష్టి పెట్టామన్నారు. ఇండియాకు స్వాతంత్ర్యం ఇచ్చేందుకు బ్రిటీష్ వాళ్లు రెడీ అయ్యారు. తొలి ప్రధానిగా జవహర్​లాల్ నెహ్రూని ఎన్నుకున్నారు. అప్పుడు బ్రిటీష్​ ఇండియా వైస్రాయ్​గా లార్డ్​మౌంట్ బాటన్ ఉన్నారు. అధికార బదిలీపై మౌంట్ బాటన్, నెహ్రూ మాట్లాడుకుంటున్న సమయంలో రాజదండం ప్రస్తావనకొచ్చింది. ''మేం మీకు స్వాతంత్య్రం ఇస్తున్నాం కదా.. అధికారం మా నుంచి మీకు బదిలీ అవుతున్నది. దీన్ని గుర్తుపెట్టుకునేలా ఏదైనా ప్రోగ్రాం చేస్తే బాగుంటుంది' అని నెహ్రూతో లార్డ్ మౌంట్ బాటన్ అన్నారు. మౌంట్ బాటన్ రిక్వెస్ట్​ను ఇండియన్ గవర్నర్ జనరల్ రాజగోపాలాచారికి నెహ్రూ చెప్పారు. ఏదైనా సలహా ఉంటే చెప్పాలని కోరారు. అప్పుడు రాజాజీ తమిళ సంప్రదాయంలో ఉన్న ఒక విధానాన్ని నెహ్రూకు వివరించారు. ఏ దేశానికైనా కొత్త రాజుగా పదవీ బాధ్యతలు చేపట్టే టైంలో ప్రధాన పూజారి ఓ రాజదండం ఆయనకు అందజేసే సంప్రదాయం ఉందని చెప్పారు. చోళులు ఈ సంప్రదాయాన్నే అనుసరించారని వివరించారు. దీంతో అలాంటి రాజదండం తయారు చేసే పనిని రాజాజీకి నెహ్రూ అప్పగించారు. రాజదండాన్ని తయారు చేసే బాధ్యతను రాజాజీ తమిళనాడులోని తిరువడుత్తురై అథీనం మఠానికి అప్పగించారు. అప్పటి మద్రాసులోని నగల వ్యాపారి వుమ్మిడి ఈతిరాజులు, వుమ్మిడి సుధాకర్ కలిసి రాజదండాన్ని తయారు చేశారు. ఇది ఐదు అడుగుల పొడవు ఉంటుంది. పైన న్యాయానికి ప్రతీక అయిన నంది, ఎద్దు ఉంటాయి. రాజదండానికి 'సెంగోల్' (ధర్మం) అని పేరు పెట్టారు.  సెంగోల్ తయారీ పూర్తయిన తర్వాత ప్రభుత్వం తరఫున ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. తిరువడుత్తురై అథీనం మఠానికి చెందిన ముగ్గురు ప్రతినిధులు రాజదండాన్ని ముం దుగా లార్డ్ మౌంట్ బాటన్ చేతికి ఇచ్చారు. తర్వాత దాన్ని వెనక్కి తీసుకొని గంగా జలంతో శుద్ధి చేశారు. అనంతరం రాజ దండాన్ని ఊరేగింపుగా నెహ్రూ దగ్గరికి తీసు కెళ్లారు. 1947, ఆగస్టు 14వ తేదీన రాత్రి 11:45 గంటలకు నెహ్రూకి అందజేశారు. ఆ తంతు జరుగుతున్నంతసేపు ప్రత్యేకంగా రూపొందించిన ఒక పాటను పాడారు. ఇప్పుడు ఆ రాజదండం అలహాబాద్​లోని మ్యూజియంలో ఉంది.

No comments:

Post a Comment