బీఫ్ సమోసాలను తరలిస్తున్న ఆటో డ్రైవర్ అరెస్ట్

Telugu Lo Computer
0


గుజరాత్‌లోని సూరత్‌లో గోమాంసంతో తయారు చేసిన సమోసాలను తరలిస్తున్న ఆటో డ్రైవర్‌ను  అరెస్ట్ చేశారు. ఆటోలో బీఫ్ సమోసాలను ఓ వ్యక్తి తరలిస్తున్నాడనే సమాచారం అందుకున్న సూరత్ పోలీసులు మొసాల్ ప్రాంతం మీదుగా వెళుతున్న ఆటోను అడ్డగించి సోదాలు చేపట్టారు. తనిఖీల్లో మాంసం నింపిన 45 సమోసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు బీఫ్ సమోసాలను పరీక్షించాలని ఫోరెన్సిక్ బృందాన్ని కోరారు. సమోసాల్లో బీఫ్‌ను నింపారని ఎఫ్ఎస్ఎల్ నివేదికలో వెల్లడవంతో కేసు నమోదు చేశామని సూరత్ పోలీసులు వెల్లడించారు. నిందితుడిని ఇస్మాయిల్ యూసఫ్ జిబైగా గుర్తించారు. జంతు సంరక్షణ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద యూసుఫ్‌పై కేసు నమోదు చేశామని సూరత్ డీఎస్పీ వీకే బనర్ తెలిపారు. బీఫ్‌ను నిందితుడికి ఎవరు సరఫరా చేశారనే వివరాలపైనా పోలీసులు కూపీ లాగుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)