భారత్ కు రష్యా అభ్యర్థన !

Telugu Lo Computer
0


పాశ్చాత్య దేశాలు రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నుంచి రష్యాను సస్పెండ్ చేశారు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నిబంధనలతో రష్యాను ఆర్థికంగా ఒంటరిని చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రపంచ దేశాలను కోరుతున్నారు. వచ్చే నెలలో దీనికి సంబంధించిన సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని నుంచి బయటపడటానికి రష్యా, భారతదేశ సాయం కోరుతోంది. ఆప్తమిత్ర దేశం అయిన రష్యాతో భారత్ కు అనేక వ్యాపార, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. భారతదేశంలో అనేక ప్రాజెక్టులను రష్యా చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కింద రష్యాను ఆర్థికంగా ఒంటరి చేస్తే ఆ ప్రభావం భారత్ పై పడుతుంది. రష్యాను బ్లాక్ లిస్టులో చేర్చాలంటూ ఉక్రెయిన్ పాశ్చాత్యదేశాలపై క్రమంగా ఒత్తిడి పెంచుతోంది. భారత్ తన పలుకుబడితో ఈ ప్రమాదం నుంచి బయటపడేయాలని రష్యా అభ్యర్థిస్తోంది. సహజంగా ఉగ్రవాదానికి ఊతం ఇచ్చేలా ఆర్థిక నిధులను సమకూర్చే దేశాలపై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నిబంధనలు విధిస్తుంది. అయితే రష్యా ఉగ్రవాదులు కానీ, ఉగ్రవాదానికి నిధులు కానీ ఇవ్వడం ఎప్పుడు జరగలేదు. ఈ నేపథ్యంలో ఆంక్షల కిందకు రష్యా ఎలా వస్తుందని ఆ దేశం ప్రశ్నిస్తోంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ బ్లాక్ లిస్టులో ఉత్తర కొరియా, ఇరాన్, మయన్మార్ దేశాలు ఉన్నాయి. ఒక వేళ ఆంక్షలు విధిస్తే రష్యా కూడా ఈ జాబితాలో చేరుతుంది. బ్లాక్ లిస్టులో ఉంటే ఆ దేశాలతో వాణిజ్యం, వ్యాపారం చేయడానికి వీలు లేదు. ఎలాంటి లావాదేవీలకు అవకాశం లేదు. ఇది రష్యాకే కాదు భారత్ కు కూడా ప్రమాదమే. భారత్, రష్యాల మధ్య పలు ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుంది. గ్లోబల్ సౌత్ గా పిలువబడే పలు దేశాలు రష్యా-ఉక్రెయిన్ పరిణామాల్లో తటస్థంగా ఉన్నాయి. రష్యాకు వ్యతిరేకంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కొత్త చర్యలను అవలంబిస్తే, రక్షణ, ఇంధనం మరియు రవాణాలో సహకారం కోసం అనూహ్యమైన మరియు ప్రతికూల పరిణామాలు ఉంటాయని ఈ నెల ప్రారంభంలో ఒక రష్యన్ స్టేట్ ఏజెన్సీ భారతదేశంలోని తమ సహచరులను హెచ్చరించింది. ఈ హెచ్చరికలకు భారత్ స్పందించో లేదో అనే విషయాన్ని రష్యా, భారత ప్రభుత్వాలు ధ్రువీకరించలేదు. రష్యా చమురు దిగ్గజం రోస్‌నెఫ్ట్ మరియు నయారా ఎనర్జీ లిమిటెడ్ మధ్య సహకారం, ఎస్-400తో పాటు ఆయుధాలు, సైనిక ఎగుమతులు, దిగుమతులతో పాటు రక్షణ రంగ సాంకేతిక సహకారం. భారతదేశపు కుడంకుళం అణు విద్యుత్ ప్లాంట్‌, ఉత్తర-దక్షిణ వాణిజ్య కారిడార్ అభివృద్ధికి అనుసంధానించబడిన కార్గో రవాణా సేవలపై రష్యన్ రైల్వేస్ యొక్క RZD లాజిస్టిక్స్ మరియు కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మధ్య ఒప్పందం

Post a Comment

0Comments

Post a Comment (0)