ఓయూలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

Telugu Lo Computer
0


ఓయూలో విద్యార్థి జాక్ టీపీసీసీ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. దిష్టిబొమ్మ దాహనాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో అక్కడ పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ విద్యార్థుల నిరసన ర్యాలీ చేపట్టారు. ఇంద్ర పార్క్ కు ర్యాలీగా విద్యార్థులు బయలుదేరారు. మంత్రి తలసాని కి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. అయితే పోలీసులు మోహరించడండో కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని లేదంటే, దున్నపోతులతో, గొర్రె పొట్టేలు తో గాంధీ భవన్ ను ముట్టడిస్తామని గొల్ల కురుమల పోరాట సమితి హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కి మద్దతుగా టీ కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. చీఫ్ రేవంత్ రెడ్డి యాదవులను కించపరచలేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారే తప్ప యాదవుల గురించి ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ మొదట రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారని, ఆయనను పిసికేస్తానని కామెంట్లు చేశారని, గాంధీభవన్ ను ముట్టడిస్తామని వారు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ జోలికొస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. కాగా ప్రియాంక గాంధీ సభ తర్వాత కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణ చూసి బీఆర్ఎస్ పార్టీ నేతలు భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని టీపిసిసి వైస్ ప్రెసిడెంట్ మల్లురవి పేర్కొన్నారు. ఇక బీఆర్ఎస్ పేరుతో ఆ నాయకులు చేస్తున్నది పొలిటికల్ టూరిజమేనా అంటూ ప్రశ్నించారు. టీపీసీసీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ కారణమన్నారు. తల పొగరుతో తలసాని చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారని అన్నారు. ఈ మాటలకు యాదవులకు అంటగట్టి కుల రాజకీయాలకు తెరలేపారు అని టీపీసీసీ ప్రధానకార్యదర్శి అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఇక గాంధీ భవన్ జోలికొస్తే తెలంగాణా భవన్ ను పేల్చేస్తామని అద్దంకి దయాకర్ అన్నారు. అయితే అసలు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా? అంటూ ప్రశ్నించారు. ఇప్పటి నుంచి తలసానిని తలమాసిన శ్రీనివాస్ యాదవ్ అని పిలుస్తామని వారు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)