టైటానిక్‌ శకలాల త్రీడీ స్కాన్‌ చిత్రాల ప్రచురణ !

Telugu Lo Computer
0


చరిత్రలో ఘోర ప్రమాదాలు గురించి పేజీలు తిప్పితే, టైటానిక్‌కు కూడా అందులో చోటు ఉంటుంది. సినిమాగా తెర మీదకు వచ్చేదాకా ప్రపంచానికి పెద్దగా ఆసక్తిక కలిగించని ఈ ఓడ ప్రమాదం ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. అట్లాంటిక్‌ మహాసముద్రంలో దాదాపు 13వేల అడుగుల లోతున కూరుకుపోయిన టైటానిక్‌ శకలాలను తొలిసారిగా మానవ ప్రమేయం లేకుండా డీప్‌ సీ మ్యాపింగ్‌ను ఉపయోగించి త్రీడీ స్కాన్‌ చేశారు. అట్లాంటిక్‌ అడుగునకు ప్రత్యేక నౌక ద్వారా ఓ జలంతర్గామిని పంపించి సుమారు 200 గంటల పాటు శ్రమించి 7,00,000 చిత్రాలను తీసి స్కాన్‌ను రూపొందించారు. ఈ క్రమంలో శకలాలను ఏమాత్రం తాకకుండా జాగ్రత్త పడ్డారట. 1912లో జరిగిన టైటానిక్‌ ఘోర ప్రమాదంలో 1,500 మంది మరణించారు. లగ్జరీ ఓడ ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌ నుంచి న్యూయార్క్‌కు తొలి ట్రిప్‌గా వెళ్తున్నటైటానిక్‌ ఓడ మార్గం మధ్యలో అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఐస్‌ బర్గ్‌ను ఢీ కొట్టి నీట మునిగింది. 1985లో కెనడా తీరానికి 650 కిలోమీటర్ల దూరంలో అట్లాంటిక్‌లో వేల అడుగుల లోతున టైటానిక్‌కు సంబంధించిన శకలాలను తొలిసారి గుర్తించారు. కానీ, ఇన్నేళ్లలో ఆ శకలాల పూర్థిస్తాయి చిత్రాలను మాత్రం ఏ కెమెరాలు క్లిక్‌ మనిపించలేకపోయాయి. తాజాగా కొత్తగా తీసిన స్కాన్‌లో టైటానిక్‌ శకలాలకు సంబంధించిన పూర్తి స్థాయి దృశ్యాలు బయటపడ్డాయి. రెండుగా విడిపోయిన ఓడ భాగాలు ఇందులో కనిపిస్తున్నాయి. త్రీడీ రీకన్‌స్ట్రక్షన్‌ ద్వారా ప్రతీ యాంగిల్‌లో ఏడులక్షల ఇమేజ్‌లను తీశారు. 2022 సమ్మర్‌లోనే డీప్‌-సీ మ్యాపింగ్‌ కంపెనీ అయిన మాగెల్లాన్ లిమిటెడ్ ఈ స్కాన్‌ను నిర్వహించగా, అట్లాంటిక్‌ ప్రొడక్షన్స్‌ వాళ్లు దానిని డాక్యుమెంటరీగా ఓ ప్రాజెక్టు రిలీజ్‌ చేసింది. నీట మునిగిన టైటానిక్‌, దాని శకలాల త్రీడీ స్కాన్‌ ఫుల్‌ సైజ్‌ చిత్రాలను ప్రచురించింది ఓ ప్రముఖ మీడియా సంస్థ.


Post a Comment

0Comments

Post a Comment (0)