బైక్‌లు కారు కింద పడి నలిగిపోయాయి ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 11 May 2023

బైక్‌లు కారు కింద పడి నలిగిపోయాయి !


కాన్పూర్‌లో ఓ మహిళ తన కారుతో రోడ్డు పక్కన ఆగి ఉన్న బైక్‌లను ఢీకొట్టింది. కారును బైక్‌ల మీద నుంచి నడిపేసింది. ఈ ఘటనలో బైక్‌లు కారు కింద పడి నలిగిపోయాయి. ఇంకేముంది ఒక్కసారిగా జనం గుమిగూడారు. ఆమె అంత నిర్లక్ష్యంగా బైక్ నడపడంపై మండిపడ్డారు. అయితే తాను కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నట్లు ఆ మహిళ చెప్పింది. కారులో కూర్చుని ఆందోళన పడుతున్న మహిళకు అక్కడ ఉన్న కొందరు ధైర్యం చెప్పారట. ఈ ఘటనలో అజాగ్రత్తగా డ్రైవింగ్ చేసినందుకు ఆమెపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారట. అంతేకాదు 2500 రూపాయలు జరిమానా కూడా విధించారట. అయితే పోలీసుల సమక్షంలో ఇరు వర్గాలు ఒప్పందం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగిందని తెలుస్తోంది.

No comments:

Post a Comment