కాంగ్రెస్ శ్రేణులకు సిద్ధరామయ్య ధన్యవాదాలు !

Telugu Lo Computer
0


కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు అలుపు లేకుండా పనిచేసిన కార్యకర్తలకు ఆ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఆపై పోలింగ్ ప్రక్రియలో పార్టీ కార్యకర్తలు నిరంతరం పోరాట పటిమ ప్రదర్శించారని, వారి ప్రయత్నాలకు ఫలితం లభిస్తుందని సిద్ధరామయ్య గురువారం ట్వీట్ చేశారు. ఎన్నికల్లో పార్టీ తరపున పనిచేసేందుకు ఇంటికి దూరంగా పనిచేశారని, ఇప్పుడు మీరు ఇండ్లకు వెళ్లి భార్యా పిల్లలు, తల్లితండ్రులతో సమయం గడపాలని కోరుతున్నానని సిద్ధరామయ్య ట్విట్టర్ వేదికగా పార్టీ శ్రేణులను అభ్యర్ధించారు. మనం నిజాయితీగా శ్రమించినందుకు ఫలితం తప్పకుండా వస్తుందని, మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. నిద్రాహారాలు మాని వరుణలో తన గెలుపుతో పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్ధుల కోసం కార్యకర్తలు పనిచేశారని కొనియాడారు. రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కార్యకర్తలు, నేతలు తరలివచ్చి తనకు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. కాగా కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 120 స్ధానాల్లో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీతో పాటు తనకు అండగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. మే 10న జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్ధానాలు దక్కుతాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)