20 రోజులుగా బోధన్ ఎమ్మెల్యే కనిపిస్తలేడంటూ ఫ్లెక్సీలు !

Telugu Lo Computer
0


తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే కు బీజేపీ నాయకులు షాక్ ఇచ్చారు. షకీల్ అమీర్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు 20 రోజులుగా బోధన్ ఎమ్మెల్యే కనిపిస్తలేడంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తడిసిన ధాన్యాన్ని కొంటానన్న ఎమ్మెల్యే షకీల్ అకాల వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్న రైతులకు మాట ఇచ్చి, అప్పటి నుండి ఇప్పటి వరకు గింజ కూడా కొనలేదని ఫ్లెక్సీల్లో రాశారు. వడగళ్ల వానలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్న ఎమ్మెల్యే పత్తాలేకుండా పోయారని మాట ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి దాకా గింజ ధాన్యం కూడా కొనుగోలు చేయలేదని ఫ్లెక్సీలలో రాశారు. ఇప్పటికైనా కళ్లు తెరుచుకుని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ బోధన్ నియోజకవర్గం పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే బిజెపి నాయకులు కావాలని ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, బీజేపీ ఇలాంటి నీచమైన పనులు చేస్తుందని కానీ ప్రజలు దీన్ని పట్టించుకోరని షకీల్ వర్గం నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే నియోజకవర్గవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఒకపక్క ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రజలలోకి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ పంపించడం కోసం బీజేపీ ఈ తరహా చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)