టీటీడీ నకిలీ వెబ్‌సైట్‌ను నమ్మొద్దు !

Telugu Lo Computer
0


టీటీడీ నకిలీ వెబ్‌సైట్లతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) సూచించింది. https://tirupatibalaji.ap.gov.in/ పేరుతో అధికారిక వెబ్‌సైట్‌ ఉండగా  చిన్న మార్పులతో కొందరు వ్యక్తులు https://tirupatibalaji-ap-gov.org/ పేరిట నకిలీ వెబ్‌సైట్‌ను రూపొందించారని ఓ ప్రకటనలో తెలిపింది. ఆ ఫేక్‌ వెబ్‌సైట్‌ను నమ్మొద్దని భక్తులను కోరింది. తితిదే అధికారిక వెబ్‌సైట్‌లోనే శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదులు బుక్‌ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అలానే అధికారిక యాప్‌ను వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఇప్పటివరకు తితిదే పేరుతో ఉన్న 41 నకిలీ వెబ్‌సైట్లపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తితిదే వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)