పంజాబ్ లో ప్రభుత్వ కార్యాలయాల పని వేళల మార్పు !

Telugu Lo Computer
0


పంజాబ్ లోని ప్రభుత్వ కార్యాలయాల పని వేళలను మారుస్తున్నట్టు ప్రకటించింది.  ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయి. కొత్త పనివేళలు ఈ ఏడాది మే 2వ తేదీ నుంచి జూలై 15 వరకూ అమల్లో ఉంటాయి. విద్యుత్‌ను ఆదా చేయడానికి వీలుగా ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఈ మార్పులు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు త్వరగా తెరిచి వేసవి ఉష్ణోగ్రత పెరగడానికి ముందే మూసివేసినట్లయితే రాష్ట్రంలో విద్యుత్ ఆదా చేయడానికి ఉపయుక్తంగా ఉంటుందని సీఎం మాన్ తెలిపారు. ఇందువల్ల పవర్ గ్రిడ్‌లపై ఒత్తడి తగ్గి, విద్యుత్ ఆదా జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరుకుంటున్న తరుణంలో మాన్ సర్కార్ తాజా చర్యలకు ఉపక్రమించింది. గత ఏడాది పంజాబ్, ఢిల్లీ, హర్యానాలో బొగ్గు నిల్వల కొరత కారణంగా తీవ్రమైన విద్యుత్ కొరత తలెత్తింది. మాన్ తాజా నిర్ణయంతో కీలకమైన వేళల్లో విద్యుత్ శాఖ సమర్ధవంతంగా కరెంట్ సరఫరా చేయగలుగుతుందని అంచనా వేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)