మెడికల్ షాప్ సిబ్బందిపై దాడి చేసిన కొడవళ్ల గ్యాంగ్‌ !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని పూణేలో కొడవళ్లు పట్టుకున్న ఆరుగురు వ్యక్తులు పింప్రి చించ్ వాడ్ లోని ఓ మెడికల్ షాపులోకి చొరబడ్డారు. అక్కడి సిబ్బందిపై దాడి చేయడంతో పాటు మెడికల్ షాపును ధ్వంసం చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెడికల్‌ షాపు సిబ్బంది ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. షాపులోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. కేసు విచారణలో భాగంగా కొడవళ్ల గ్యాంగ్ మెడికల్ షాప్ సిబ్బందిపై దాడికి ముందు కామ్ గర్ నగర్ ప్రాంతంలో కొన్ని వాహనాలను ధ్వసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. గత నాలుగు నెలల్లో పూణేతోపాటు మహారాష్ట్రలోని పలు చోట్ల కొడవళ్ల గ్యాంగ్ దాడులు ఎక్కువయ్యాయి. 100కు పైగా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. దీంతో 'కొడవళ్ల గ్యాంగ్‌'లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పోలీస్‌ అధికారులను ఆదేశించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)