గిన్నిస్ రికార్డుకెక్కిన పొడవాటి ముక్కు !

Telugu Lo Computer
0


బ్రిటన్ కి చెందిన థామస్ వాడేహౌస్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముక్కును కలిగి ఉన్నాడు. ఆయన ఫోటోలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతని చిత్రాన్ని ట్విట్టర్‌లో @pubity అకౌంట్ ద్వారా షేర్ చేశారు. దీనితో పాటు అతని వివరాలను కూడా వివరించారు. దాని ప్రకారం థామస్ వాడ్‌హౌస్ 18వ శతాబ్దానికి చెందిన సర్కస్ ప్రదర్శనకారుడు. అతను 7.5 అంగుళాల పొడవైన అతిపెద్ద ముక్కును కలిగి ఉన్నాడు. థామస్ వాడేహౌస్ ఇంగ్లండ్‌లో నివసించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెబ్‌సైట్‌లో ఈ వ్యక్తి గురించి ఒక పేజీ కూడా ఉంది. వారి గురించిన సమాచారం అక్కడ ఇవ్వబడింది. థామస్ వాడ్‌హౌస్ 1770లలో ఇంగ్లండ్‌లో నివసించాడని.. సర్కస్‌లో పనిచేశాడని రాశారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటో లండన్‌లోని రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మ్యూజియంలోనిది. అతని మైనపు విగ్రహం అక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. అంత పొడవాటి ముక్కును చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అయితే, జీవించి ఉన్న వారి విషయంలో పొడవైన ముక్కు రికార్డు టర్కీకి చెందిన మెహ్మెట్ ఓజురెక్ పేరు మీద ఉంది. ఈ రికార్డును రెండు సంవత్సరాల క్రితం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ధృవీకరించింది. అతని ముక్కు పొడవు 3.46 అంగుళాలు.

Post a Comment

0Comments

Post a Comment (0)