భార్యను కాటేసిన పామును పట్టుకొని ఆస్పత్రికెళ్లిన భర్త !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లా సఫీపూర్‌ కొత్వాలి ప్రాంతానికి చెందిన ఉమర్‌ అత్వా గ్రామానికి చెందిన నరేంద్ర అనే వ్యక్తి భార్య కుస్మను పాము కాటేసింది. ఆ మహిళ వంట చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ విషయం ఆమె భర్తకు తెలుస్తుంది. అయితే అతను భార్యను చూసేందుకు ఆస్పత్రికి వెళ్లకుండా నేరుగా ఇంటికి వెళ్లి పామును పట్టుకుని గోనె సంచిలో బంధించి ఆస్పత్రికి తీసుకువచ్చాడు. ఒక్కసారిగా అక్కడ ఉన్న వైద్యులు కంగుతిన్నారు. ఎందుకిలా చేశావ్‌ అని అడిగితే.. ఏ పాము కాటేసిందో తెలిసుకుని వైద్యం చేయలని ఆ వ్యక్తి కోరడంతో.. వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే సదరు మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడిందని వైద్యులు తెలిపారు. వాస్తవానికి ఆ వ్యక్తి భార్యను చూసేందుకు ఆస్పత్రికి ఒక్కసారి కూడా రాకపోవడం గమనార్హం. బదులుగా ఇంటికి వెళ్లి పాముని పట్టుకుని ఆస్పత్రికి తీసుకురావడం విశేషం.

Post a Comment

0Comments

Post a Comment (0)