కేరళలో తొలి వాటర్‌ మెట్రోను ప్రారంభించిన మోడీ

Telugu Lo Computer
0


దేశంలో మొట్ట మొదటి వాటర్ మెట్రోను కేరళలో ప్రధాని ప్రారంభించారు. 3,200 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేశారు. అలాగే తిరువనంతపురం రైల్వే స్టేషన్‌లో కేరళ తొలి వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు తిరువనంతపురం నుండి కాసరగోడ్ మధ్య నడుస్తుంది. ఈ సందర్భంగా ఆయన వెంట కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఎంపీ శశిథరూర్ ఉన్నారు. దేశంలో కేరళలో తొలిసారి కొత్త మెట్రో వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. కోచి వాటర్ మెట్రో పేరుతో నీటిపై నడిచే మెట్రో సర్వీస్‌ను ప్రధాని మోదీ మంగళవారం జాతికి అంకితం చేశారు. దేశంలో, దక్షిణాసియాలోనే తొలి వాటర్‌ మెట్రో ఇదేనని కేరళ రాష్ట్రం కలల ప్రాజెక్ట్‌ అని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అభివర్ణించారు. కోచి మెట్రో రైల్‌ లిమిటెడ్‌ దీని నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. కోచి చుట్టుపక్కల ఉండే 10 ద్వీపాలను కలుపుతూ ఈ వాటర్‌ మెట్రో రాకపోకలు సాగిస్తుంది. కొచ్చి వాటర్ మెట్రో నగరం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రూ.1,136 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కేరళకు కలల ప్రాజెక్టుగా ప్రచారం జరుగుతోంది. ఇది ప్రజా రవాణా, పర్యాటకం ద్వారా నగరంలో ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించగలదు. వాటర్ మెట్రోలో ప్రయాణానికి కనీస ఛార్జీ రూ. 20. సాధారణ ప్రయాణీకులు.. బస్సు లేదా లోకల్ రైలు వంటి వారపు, నెలవారీ పాస్‌లను కూడా తీసుకోవచ్చు. వారంవారీ అద్దె రూ. 180 కాగా, నెలవారీ అద్దె రూ. 600, త్రైమాసిక అద్దె రూ. 1,500 అవుతుంది. ఇది మాత్రమే కాదు.. ప్రయాణికులు ఒకే స్మార్ట్ కార్డును ఉపయోగించి కొచ్చి మెట్రో రైలు, వాటర్ మెట్రోలో ప్రయాణించగలరు. టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి కొచ్చి వన్ యాప్‌ని ఉపయోగించవచ్చు. వాటర్ మెట్రోగా నడపబడే బోట్లను కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. ఈ ప్రాజెక్టుకు జర్మనీకి చెందిన KFW సహకారంతో కేరళ ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. ఇందుకోసం దాదాపు రూ.1,137 కోట్లు వెచ్చించారు. వాటర్ మెట్రో మొదట 8 ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్లతో ప్రారంభమవుతుంది. తరువాత వాటి సంఖ్యను పెంచుతారు. ఇది మెట్రో రైలు లాగా పూర్తిగా ఎయిర్ కండిషన్ చేయబడి 15 నిమిషాల వ్యవధిలో 12 గంటల పాటు ప్రతిరోజూ నడుస్తుంది. ప్రస్తుతం ప్రారంభంలో 23 బోట్లు, 14 టెర్మినల్స్ ఉన్నాయి. అదే సమయంలో ఒక్కో మెట్రోలో 50 నుంచి 100 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)