ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ, షుగర్‌ !

Telugu Lo Computer
0


మానసిక ఒత్తిడి, ఆర్థికపరమైన ఇబ్బందులు తదితర కారణాల వల్ల మనిషి అనారోగ్యం బారిన పడుతున్నాడు. జీవనశైలిలో మార్పులు చేసుకుంటే జీవితం హాయిగా సాగిపోతుంటుంది. ముఖ్యంగా ఆహార నియమాలలో మార్పులు జరిగితే వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా బీపీ, షుగర్‌లు బారిన పడేవారు అధికం. ఇంతకు ముందు పట్టణాల్లోనే ఎక్కువగా కనిపించిన ఈ జబ్బులు ఇప్పుడు పల్లెల్లోనూ వ్యాపిస్తున్నాయి. ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ, 30 ఏళ్లు నిండిన ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్‌ ఉందంటే అర్ధం చేసుకోవచ్చు దీని తీవ్రత ఎలా ఉందో. అవగాహన లేమి కొందరు, నిర్లక్ష్యంతో మరికొందరు ఈ రెండు ప్రమాదకర జబ్బులను నియంత్రణలో ఉంచుకోలేక వివిధ వ్యాధులు బారిన పడుతున్నారు. వ్యాయామం లేక, ఆహార నియమాలు పాటించకపోవడం వీటికి కారణమవుతున్నాయి. పిల్లలు ఎలక్ట్రానిక్‌ పరికరాల ప్రభావానికి లోనవుతున్నారు. దీని నుంచి బయటపడాలంటే వారిని క్రీడల వైపు మళ్లించాలి. పెద్దవాళ్లు యోగా చేయాలి. శారీరక వ్యాయామం లేకుంటే చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది.  ప్రతి రోజు వాకింగ్‌ అలవాటు చేసుకోవడం ఎంతో మంచిది. 

Post a Comment

0Comments

Post a Comment (0)