దీనస్థితిలో గాయకుడు నాగరాజు !

Telugu Lo Computer
0


అనితా ఓ అనితా నా అందమైన అనిత.. దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ మీద.' ఈ పాట వినని వారు ఉండరేమో. అంతలా యువతను ఊపేసింది ఆ సాంగ్. ఎక్కడ చూసినా ఆ సాంగ్ మార్మోగిపోయింది. దాదాపు 15 ఏళ్ల క్రితం ప్రతి ఒక్కరినీ ఊర్రూతలూగించింది. వయసుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా అందరి నోళ్లలో ఈ పాట వినిపించేది. అప్పట్లో ఓ రేంజ్‌లో ఫేమస్ అయినా ఈ సాంగ్ రాసిన యువకుడు పేరు నాగరాజు. నాగరాజు మాట్లాడుతూ..'ఒక వీడియో సాంగ్‌ పాటకు అనితా పాటను అటాచ్‌ చేశారు. నిజంగా నేను చనిపోయానని అప్పుడు రూమర్స్ వచ్చాయి. అప్పుడు నాకు చాలా బాధనిపించింది. హైదరాబాద్‌ అంటే కొత్త కొత్తగా ఉంటుంది. భయంతో నేను మా ఊరికి వెళ్లిపోయా. ఇప్పుడు అనితకు పెళ్లి అయిపోయింది. నాకు కూడా పెళ్లి జరిగింది. నిజంగా అనితకు థ్యాంక్స్ చెప్పాలి. ఆమె వల్లే నేను ఈ పాట రాయగలిగాను. అమ్మాయి ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకపోవడం వల్ల మా లవ్ బ్రేకప్ అయింది.' అని అన్నారు. నా ప్రేమను ఓ పాట రూపంలో చెబుదామని ప్రయత్నించానని నాగరాజు తెలిపారు. ఇప్పుడు నాకు మంచి అమ్మాయి భార్యగా వచ్చిందని ఆయన అన్నారు. తన కుటుంబం గురించి నాగరాజు మాట్లాడుతూ.. 'ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు. పెద్దబ్బాయికి మూగ, చెవిటి. మాటలు రావు. చిన్నబ్బాయి కూడా అన్నతో పాటే సైగలే చేస్తుంటాడు. ఇంతకుముందు ఒక చిన్న పాన్‌షాపు పెట్టుకుని జీవనం కొనసాగించా. ఎవరన్నా పిలిస్తే వెళ్లి పాటలు పాడేవాన్ని. నా తమ్ముడు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అతనితో పాటే ప్రస్తుతం నేను హైదరాబాద్‌లోనే ఉన్నానని' తెలిపారు. కాగా ప్రస్తుతం అనితా పాటకు సీక్వెల్‌గా అనిత-2 సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు నాగరాజు వెల్లడించారు. 'నా ప్రాణమా నిను మరిచిపోనులే.. ఊపిరి ఆగినా నీ మీద ప్రేమ చావదే'. అంటూ సాగే సాంగ్‌ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు నాగరాజు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)