సీనియర్ సిటిజన్లకు రైళ్లలో రాయితీ ఇవ్వండి !

Telugu Lo Computer
0


సీనియర్ సిటిజన్లకు రైలు ప్రయాణ ఛార్జీల రాయితీనిపునరుద్ధరించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. 'దయచేసి సీనియర్ సిటిజన్లకు రైల్వే ఇచ్చే రాయితీని ఆపవద్దు. కోట్లాది మంది వృద్ధులు ఈ రాయితీతో లబ్ధి పొందుతున్నారు' అని అందులో పేర్కొన్నారు. పెద్దల ఆశీర్వాదం లేకుండా ఏ సమాజం లేదా దేశం పురోగమించదని అన్నారు. దేశాభివృద్దికి మూలమైన వృద్ధులకు రైలు టిక్కెట్ రాయితీని రద్దు చేయడం 'దురదృష్టకరం' అని అభివర్ణించారు. వృద్ధులకు రైల్వే ఇచ్చే రాయితీ వల్ల రూ.1,600 కోట్లు భారం పడుతుందని కేజ్రీవాల్ తెలిపారు. అయితే రూ.45 లక్షల కేంద్ర వార్షిక బడ్జెట్‌ సముద్రంలో ఈ రాయితీ ఖర్చు ఒక చిన్న నీటి బిందువని ఆయన పేర్కొన్నారు. ఈ రాయితీని ఆపడానికి ద్రవ్య పరిమితులు కారణం కాకూడదని అన్నారు. ఉచిత తీర్థ యాత్రల కోసం బడ్జెట్‌లో రూ.50 కోట్లను కేంద్రం కేటాయించడాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రధాని మోదీకి శనివారం రాసిన ఈ లేఖను ట్విట్టర్‌లో సోమవారం పోస్ట్‌ చేశారు.






Post a Comment

0Comments

Post a Comment (0)